27, నవంబర్ 2009, శుక్రవారం

స్త్రాండ్ బుక్ ఫెస్టివల్

ఇటీవలే బెంగలూరు బుక్ ఫెస్టివల్ ముగిసింది. ఆ ఫెస్ట్ మొదటి రోజునే స్త్రాండ్ బుక్ ఫెస్టివల్ ఈమెయిలు అందుకున్నాను. సో, ఆరోజు బుక్ ఫెయిర్ లో కేవలం తెలుగు పుస్తకాలు మాత్రమే కొన్నాను. ఎందుకంటే, అక్కడ నాకు కావలసిన పుస్తకాలు వెతకాలేంటే చాలా sఅమమయం పడుతుంది మరి. కాని సంతోషించవలసిన విషయం ఏమిటంటే ఆరోజు అక్కడ కొన్న తెలుగు పుస్తకాలన్నీ నేను ఎప్పుడో ఒకప్పుడు చదవగాలిగేవే. ముఖ్యం గ చలం గారి ఔతొబిఒగ్రఫ్య "చలం" దొరికింది. దానితోపాటే స్వర్గీయ శోభన్ బాబు జీవిత చరిత్ర కూడా సేకరించ గలిగాను. వీటితోపాటే ఎప్పుడో ఒకటిన్నర శతాబ్దం కింద ప్రచురితమైన తెలుగు లోకోక్తులు అనబడే ఉపయోగకరమైన పుస్తకం కూడా లభించింది. పుస్తకాల విక్రయదారు సిఫారసుతో దేవీ భాగవతం పుస్తకం కూడా కొన్నాను.
ఇక ఈరోజు స్త్రాండ్ బుక్ ఫెస్టివల్ కు వెళుతున్నాను. ఈ ఈవెంట్ సంవత్సరానికి రెండు సార్లు క్రమం తప్పకుండా బెంగలూరు మహా నగరం లో జరిగుతోంది. నేను గత నాలుగు సంవత్సరాలుగా అక్కడికి తంచాను గా హాజరవుతుంటాను. అక్కడ కేవలం ఆంగ్ల భాషా పుస్తకాలు మాత్రమే లభిస్తాయి. కాని నేను ఇప్పటిదాకా చదివిన ఎప్పటికీ గుర్తుండిపోయే ఇంగ్లీష్ పుస్తకాలలో చాలా అక్కడ కొన్నావే! ఇంతకు ముందైతే నవంబర్/డిసెంబర్ మాసాలలో జరిగే ప్రదర్శన చిన్నస్వామి స్టేడియం లో జరిగేది. కాని ఈ ఏడు బసవభావన్ లో జరుగుతోంది. ఈ ఈవెంట్ గురించిన మిగతా విషయాలు నా తదుపరి వ్యాసం లో రాస్తాను.