కొద్ది సేపటి క్రితం యాహూ మెయిల్ చెక్ చేద్దామని యాహూ వెబ్ సైట్ ని సందర్శించినప్పుడు ఒక వీడియో నన్ను ఆకర్షించింది. ఇటీవలి కాలంలో సమాచార మాధ్యమాలలో ప్రాచుర్యంలోకి వచ్చిన ఒక స్పాన్టేనియస్ హ్యూమన్ కంబషన్ ఘటన గురించి వివరించే వీడియో అది.స్పాన్టేనియస్ హ్యూమన్ కంబషన్ ఘటన తమిళ నాడు రాష్ట్రం లో ని విల్లుపురం ప్రాంతం లో జరిగింది. స్పాన్టేనియస్ హ్యూమన్ కంబషన్ అంటె మానవ శరీరం తనంతట అదే దహించుకు పోవడం అన్న మాట. నేచర్ వరల్డ్ న్యూస్ అంతర్జాల ప్రచురణ రాహుల్ అనే విల్లుపురం ప్రాంతానికి చెందిన మూణ్నేల్ల పసివాడు ఈ విధంగా స్పాన్టేనియస్ హ్యూమన్ కంబషన్ ద్వారా తీవ్ర గాయాల పాలైనట్లు కథనం ప్రచురించింది.పలు జాతీయ అంతర్జాతీయ వార్తా పత్రికలలో కూడా ఈ ఘటన ప్రస్తావిన్చాయి.
కాలిన్ విల్సన్ వ్రాసిన అక్కల్ట్ అనే పుస్తకంలో కూడా ఈ విషయ ప్రస్తావన ఉంది. ప్రస్తుత టపా మొదటి పేరా లో ప్రస్తావించిన వీడియో ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఇంతవరకు రెండు వందల సంఘటనలు జరిగినట్టుగా చారిత్రిక ఆధారాల ద్వారా తెలుస్తోంది. స్పాన్టేనియస్ హ్యూమన్ కంబషన్ ను ఆంగ్ల భాషలో ఎస్.హెచ్.సి అని కురుచగా పిలుస్తున్నారు.
విజ్ఞాన శాస్త్ర ప్రస్తుత పరిజ్ఞానం తో ఎస్.హెచ్.సి గురించి పూర్తిగా హేతుబద్ధ మైన వివరణ ఇవ్వడానికి సరిపడే పరిశోధనలు జరగలేదు. కానీ జో నికెల్ అనే వైజ్ఞానికుడు మరియు జాన్ ఎఫ్ ఫిషేర్ అనే ఫోరెన్సిక్ నిపుణుడు 1984 లో ఈ విషయం పై రెండేళ్ళ పాటు విస్తృత పరిశోధనలు చేసి తమ పరిశోధనలో తేలిన విషయాలను అక్షరబద్ధం చేసినట్టు వికి పెడియా వ్యాసం ద్వారా తెలుస్తోంది.
ఈ విషయం గురించి మరింత సమాచారం తెలుసుకోవాలనుకునే చదువరులు హౌ స్టఫ్ వర్క్స్ వెబ్ సైట్ లో టేల్స్ అఫ్ స్పాన్టేనియస్ కంబషన్ అనే వ్యాసం చదవగలరు. అంతే కాకుండా , ది శాడో ల్యాండ్ అనే వెబ్సైటు లో ఎస్.హెచ్.సి చాయా చిత్రాలు కూడా చూడవచ్చు. ఈ ఎస్.హెచ్.సి ఘటనల పై విజ్ఞాన శాస్త్రం భవిష్యత్తు లో ఎలాంటి స్పష్టత ఇస్తుందో భవిష్యత్తులో తెలుసుకుందాం.