ఇప్పుడు నేను ఆడం గిల్చ్రిస్ట్ స్వీయ చరిత్ర "ట్రూ colors" చదువుతున్నాను. క్రికెటర్స్ జీవిత చరిత్రలు చదవడం వలన ఒక మనిషి మానసికంగా ఎదగడానికి ఎంత కష్ట పడవలసి వస్తుందో, విభిన్న మనస్తత్వాలు గల సహచరులతో కలిసి పనిచేయడం , టీం స్పిరిట్ పెంపొందించుకోవడం లాంటి విషయాల పై అవగాహన ఏర్పడుతుంది. ఈ పుస్తకం చదువుతున్నప్పుడు నన్ను బాగా ఆకట్టుకున్న విషయం ఏమిటంటే, భారత్ ఆస్ట్రేలియా రెండు దేశాలు క్రికెట్ ను ప్రాణం గా అభిమానించే సంప్రదాయం కలిగినవే, కానీ ఆస్త్రలింల పోరాట పటిమ వారి దేశవాళీ క్రికెట్లో ఉన్నా పోటీ ని ప్రతిబింబిస్తుంది. మన దేశ క్రికెటర్లు కొద్దిగా పెరోచిన వెంటనే సెలెబ్రిటీల కోవలో చేరి ఆటను మరిచిపోతుంటారు. భారత క్రికెటర్లు మానసికంగా ఆస్సీ ఆటగాళ్లంతా ద్రుదమన వారు కారు. మరి ఇరు దేశాల వారి శారీరక ధృడత్వం గురించి అందరికీ తెలిసిందే.
రెండు సంవత్సరాల క్రిందట స్టీవ్వా atobiographee చదివాను. కానీ అది అతను రాసినది కాదు. అతని ఏజెంట్ స్టీవ్ వా కోసం రాసిన పుస్తకమది. కాని అది వా ఆలోచనలను కల్లకుకట్టినట్లు చూపించింది. అతని జీవిత చరిత్రలో కూడా నన్ను ఆకట్టుకున్న విషయం ఏమిటంటే అతని మానసిక ధృడత్వం మరియు పోరాటపటిమ. ఒక ఆస్ట్రేలియా ఆటగాడిగా అతను మన దేశం తో క్రికెట్ ఆడుతున్నప్పుడు అతని గొప్పతనాన్ని స్వీకరించడానికి కొంచెం కష్టం గానే ఉండేది కాని ఒక ఆటగాడిగా, కాప్టైన్ గా అత్దేడుర్కొన్న సవాళ్లు నిజంగా ఎవరికైనా స్ఫోఒర్థిదాయకమైనవె.
ఇవన్నీ ఎందుకు రాయవలసి వచ్చిందంటే మన కుర్రకారులో పుస్తకాలు చదివే అలవాటు బాగా తగ్గిపోయి సినిమాలనే జీవితం గా చేసుకునే వెర్రి బాగా మితిమీరి పోయింది. తత్ఫలితం గా వారి కి కొన్ని విషయాలపై ఉండవలసిన కనీస జ్ఞానం కూడా కరువై చాలా దీన స్థితి లో ఉన్నారు.
గురజాడ, విశ్వనాథ, శ్రీ శ్రీ, గోపీచంద్, చలం, దాసరథి బ్రదర్స్ ఇంకా మరెందరో గొప్ప సాహితీ వేత్తలకు జన్మనిచ్చిన మన ఆంద్ర దేశం(ముక్కలవని) లో ఇప్పుడు అర్థవంత మైన రచనలూ రావట్లేదు , మనమూ చదవట్లేదు. హృదయవిదారకం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి