19, ఫిబ్రవరి 2019, మంగళవారం

bhagavadgita

నేను 80 వ దశకంలో పుట్టి పెరిగిన వాణ్ని గనక కాలక్షేపానికి పుస్తకాల మీద ఎక్కువ గా ఆధారపడే  వాణ్ని. అప్పట్లో చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు లాంటి మాసపత్రికల తో పాటు  చాలా చిన్న చిన్న ఫాంటసీ, సాహస నవలలు కూడా తెలుగు లో ప్రచురించేవారు. మధుబాబు నవలలు అన్నీ అప్పట్లో అలాగే వచ్చేవి.
      ఇక సెలవుల్లో ఎప్పుడైనా ఆడు కోవడానికి మిత్రులు అందుబాటులో లేనప్పుడో లేదా  చదవడానికి కొత్త పుస్తకాలు లేనప్పుడో మా ఇంట్లో ఉన్న తి తి దే వారి చిన్న భగవద్గీత పుస్తకాన్ని చదివే వాడిని . 12-13 ఏళ్ల వయసులో అందులోని చాలా విషయాలను అర్థం చేసుకోలేక పోయినా ఆ పుస్తకాన్ని చదివిన అనుభూతి మాత్రం బాగుండేది. అందులో అర్థం చేసుకొన్న చాలా విషయాలు చాలా ఏళ్ల  వరకు గుర్తున్నాయి. భగవద్గీ త అనగానే చాలా మంది అదేదో వృద్ధాప్యంలో చదవ వలసిన ఆధ్యాతిక గ్రంథం గా భావిస్తుంటారు. కానీ చిన్న వయసు నుండి భగవద్గీత ను చదివి అందులో మనకు స్ప్హూర్తి నిచ్చే విషయాలను మననం చేసుకోవడం, ఆచరణలో పెట్టడం  వలన దైనందిన జీవితంలో ఎదురయ్యే అతి సాధారణ సవాళ్ళనుంచి  అప్పుడప్పుడు మన మనసును అతలాకుతలం చేసే బాధాకరమైన  ఆలోచనలు దాకా అన్ని మానసిక సమస్యలకు ఉపశమనం లభిస్తుందనేది నా ప్రగాఢ నమ్మకం.
  ఈ మధ్యకాలం లో ఎందుకో దేవదత్ పట్టనాయక్ రాసిన మై గీత అనే పుస్తకం చదివాలనిపించి చదివాను. ఆ తరువాత ఎప్పుడో తెచ్చుకుని చదవకుండా పక్కన పెట్టిన రెండు తెలుగు భగవ్ద్గీతలు కూడా చదివాను. అంతే కాకుండా కిండిల్ అన్ లిమిటెడ్ ప్లాన్ లో  ఉచితం గా చదువు కొనే సదుపాయం గల కొన్ని భగవద్గీత  ఈ బుక్స్  డౌన్లోడ్ చేసుకుని చదవడం ప్రారంభించాను. ఈ మొత్తం ప్రక్రియ లో  నేను పై న చెప్పిన నా నమ్మకం నాలో మరింత దృఢమైంది.
ఈ పోస్ట్ రాయడం వెనుక అసలు కారణం ఏమిటంటే పాఠకుల లో పుస్తక పఠనాభిలాష కలిగిన వారు భగవద్గీత ను మిగతా వ్యక్తిత్వ వికాస పుస్తకాల లాగే చదివి అందులో ని శ్లోకార్థాలను మన దైనందిన జీవితాల్లో మార్గదర్శకాలు గా వాడుకోవడం వలన ఒక రకమైన మానసిక సమతూకంతో జీవించడం అనేది అలవడుతుంది అని చెప్పడమే.

భగవద్గీత చదివి స్ఫూర్తి  పొందిన వారిలో లోకమాన్య బాల గంగాధర తిలక్, జాతి పిత మహాత్మ గాంధీయే కాకుండా అమెరికన్ కవి వాల్ట్ విట్ మన్, భౌతిక శాస్త్రవేత్త జె రాబర్ట్ ఓపెన్ హెయిమేర్  లాంటి వారు కూడా ఉన్నారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి