12, ఫిబ్రవరి 2012, ఆదివారం

పాట్రిక్ ఫ్రెంచ్ రచన "ఇండియా- ఎ పోర్త్రైట్" 120 కోట్ల ప్రజల జీవిత చరిత్ర

గత చాలా రోజుల నుంచి మా కాలేజి లో ప్రోఫ్.జున్జప్ప అనే కెమిస్ట్రీ ఆచార్యుడు నాతో పాట్రిక్ ఫ్రెంచ్ అనే ఆంగ్ల రచయిత వ్రాసిన  "ఇండియా- ఎ పోరట్ రైట్" అనే పుస్తకం గురించి తరచూ ప్రస్తావిస్తూనే ఉన్నారు.ఈ మధ్య ఓ సారి ఆయనను కలిసినపుడు ఆ పుస్తకాన్ని ఓ సారి ఇస్తే చదివి ఇస్తానన్న్నాను.మరుసటి రోజే ప్రొఫెసర్ ఆ పుస్తకాన్ని నాకిచ్చారు.
   పాట్రిక్ ఫ్రెంచ్ టిబెట్ మీద,మన దేశం మీద మరియు ప్రఖ్యాత ఆంగ్ల రచయిత వి.ఎస్.నైపాల్ మీద పుస్తకాలు రాసినట్టు తెలుసుకున్నాను.మన దేశ చరిత్ర మీద,సంస్కృతీ సంప్రదాయాల మీద గత మూడు వందల సంవత్సరాల నుంచీ ఆగ్లేయ చరిత్రకారులు మాత్రమే లోతైన పరిశోధనాత్మక గ్రంథాలు రాస్తున్నారు.విల్లియం దార్లిమ్పుల్ లాంటి సమకాలీన ఆంగ్ల రచయితలు మన దేశంలోనే ఉంటూ, మన సామాజిక,రాజకీయ,ఆధ్యాత్మిక జన జీవన చిత్రణ చేస్తున్నారు.నేను ప్రస్తావిస్తున్న పాట్రిక్ ఫ్రెంచ్ కూడా ఈ కోవలోకి చెందిన వాడే.
  ఈ పుస్తకం చాడువుతూన్నంత కాలం, మన గురించి మన కంటే ఇతర దేశీయులకు మంచి అవగాహన ఉందనిపించింది. భారత దేశ సమకాలీన చరిత్ర పై ఒక మంచి పుస్తాన్ని చదవగోరే ప్రతి ఒక్కరికీ నిస్సంకోచంగా నేను ఈ పుస్తకాన్ని సిఫారసు చేస్తున్నాను. రాష్ట్ర,లక్ష్మి  మరియు సమాజ అనే మూడు భాగాలుగా విభాజిమ్పబడ్డ ఈ పుస్తకమ్ లో, మన పాలక వ్యవస్థ,ఆర్ధిక సామాజిక వ్యవస్థ ల లోని భిన్న కొణాల పై లోతైన విశ్లేషణ చదువవచ్చు.
 నేను చదివే పుస్తకాల ను అంతర్జాలంలో గూగుల్ చేయడం నాకు అలవాటు.పాట్రిక్ ఫ్రెంచ్ పుస్తకాన్ని గూగుల్ చ్సినపుడు బుకర్ అవార్డు గ్రహీత అరవింద్ అడిగ ది గార్డియన్ పత్రిక కోసం వ్రాసిన విమర్శనాత్మక వ్యాసం చదవడం జరిగింది.అరవింద్ అడిగ ఉద్దేశ్యం ప్రకారం ఈ పుస్తకం భారత దేశ కాల మాన పరిస్థుతులలో కేవలం అతి కొన్ని అంశాలను మాత్రమే ప్రస్తావిస్తుంది. ఏది ఏమైనప్పటికీ నాకు మాత్రం ప్రతి భారతీయ యువతీ లేద యువకుడు తప్పని సరిగా ఈ పుస్తకం చదవడం వలన చాలా లభ్ది పొందుతారనిపించింది.
   కానీ మన మీద మనమే యదార్థమైన పుస్తకాలు వ్రాసుకోవడం చాలా ముఖ్యం.విదేశీయుల దృక్పథం లో మన చరిత్రను చదివే దుస్థితికి త్వరలోనే అడ్డుకట్ట వేస్తే బావుంటుంది.
రచయిత చాయా చిత్రాన్ని http://www.thehindu.com/multimedia/dynamic/00358/16bglak-bookfrench__358472e.jpg నుంచి స్వీకరించడం జరిగింది.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి