10, జూన్ 2012, ఆదివారం

నేటి తరం కాలేజిలు,విద్యార్థులు, అధ్యాపకులు

నేను టీచింగ్ వృత్తి లో ప్రవేశించి ఖచ్చితం గా ఒక దశాబ్దం కావస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ లో ని చిత్తూరు జిల్లాలో ఇంటర్మీడియట్ వరకు చదివి మైక్రోబయాలజీ లో డిగ్రీ చెయ్యడానికి బెంగళూరు వచ్చాను.వచ్చిన కొద్ది రోజుల వరకూ ఈ ఊరి కొత్త దనం తగ్గలేదు.ముఖ్యం గా ఇక్కడి పి.యు.సి స్టూడెంట్స్ ని ,వారి అల్లోచనలు, సాహసాలు చూసి చాలా ఆశ్చర్య పడే వాణ్ని.ఆంద్ర లో అయితే అప్పట్లో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ని కొట్టే వారు కూడా.కానే బెంగళూరు వచ్చిన తరువాత మా కాలేజి లో  నేను చూసిన గోడవలన్నీ పి.యు.సి వాళ్ళు చేసేవే.
           ఏదో లాగా డిగ్రీ ముగించిన తరువాత అదే కాలేజి లో ఎం.ఎస్.సి చేసే భాగ్యం కూడా కలగడం తో అది కూడా పూర్తి చేసి పదేళ్ళ క్రితం బెంగళూరు మహానగరం లో ని ఒక కాలేజి లో మైక్రోబయాలజీ అధ్యాపకుడి గా చేరాను.నేను చేరిన కొత్తలో ఇక్కడ  ఎం.ఎస్.సి చేయడానికి మన ఆంధ్ర ప్రదేశ్ నుంచి ఎక్కువ స్టూడెంట్స్ వచ్చేవారు.గత రెండు సంవత్సరాల నుంచి ఈ ఆంధ్ర స్టూడెంట్స్ సంఖ్య తగ్గిపోయింది.ఇప్పుడు మా కాలేజి కి అడ్మిషన్స్ తీసుకోచ్చే ఏజెంట్ మహారాష్ట్ర స్టూడెంట్స్ ని ఎక్కువ గా తీసుకొస్తున్నాడు.
      ఈ లోగా మా కాలేజి లో ఒక చిన్న సంఘటన జరిగింది.నాతో పాటు గత కొద్ది సంవత్సరాలు గా కాలేజి రూట్ బస్సు లో నేనున్న ఏరియా నుంచి ఒక సీనియర్ ప్రొఫెసర్ ప్రయాణించే వారు.ఇటీవలే ఆయన తన డిపార్టుమెంటు లో సహోద్యోగుల రాజకీయాలు, స్టుడేంట్ల కృతజ్ఞతా రాహిత్యం, గురు భక్తి ఏ కోశానా వారి లో కనిపించక పోవడం వంటి కొన్ని విషయాలతో విసిగి వేసారి తాను అధ్యాపక వృత్తి నుంచి శాశ్వతం గా తప్పుకుంటున్నట్లు గత వారం ఫేస్ బుక్ లో ప్రకటించారు.దాని తరువాత చాలా మంది ప్రస్తుత ,పూర్వ విద్యార్థులు ఆశ్చర్యం,విభ్రమ తో కూడిన వ్యాఖ్యలు చేయడం కూడా చదివాను.
    ఈ సంఘటన జరిగిన తరువాత నా లో ఎప్పటి నుంచో బలంగా నాటుకు పోయిన కొన్ని అభ్ప్రాయాలు మరింత బలపడ్డాయి.అవేమంటే,
1.ఆధునిక భారత దేశమ లో పెరుగుతున్న జనాభా కు అనుగుణంగా అధిక సమాఖ్య లో కొత్త విద్యా సంస్థల అవసరం ఉంది.
2.కోకొల్లలు గా పుట్టుకు వస్తున్న కొత్త కాలేజీలు, డీమ్డ్ యునివర్సిటీల మధ్య అడ్మిషన్ల కోసం చాలా అనారోగ్యకరమైన పోటీ నెలకొని వుంది.
౩.విద్యా రంగంలో భారీ పెట్టుబడులను పెడుతున్న పారిశ్రామిక వేత్తలు,రాజకీయ నాయకులు, పెట్టుబడులతో సమానమగా లాభాలను,కీర్తిని ఆశిస్తూ బోధనా సిబ్బంది తరువాత బోధనేతర సిబ్బంది పై విపరీతమైన ఒత్తిడి తెస్తున్నారు.
4.విద్యార్థులు,తల్లి తండ్రులలో కూడా విద్య పట్ల ఒక రకమైన వ్యాపార ధోరణి నెలకొని ఉంది.
5.విద్యా సంస్థల యాజమాన్యాలు,తల్లి దండ్రులు,విద్యార్థులు విద్య యొక్క పరమావధి ప్లేస్మెంట్స్ అయినట్లు ప్రవర్తిస్తున్నారు.
6.ఈ ధోరణి వలన విద్యా వ్యవస్థలో భారీ గా విలువల పతనం జరుగుతోంది.అధ్యాపకులకు సరి ఐన జీత భత్యాలు దొరకడం లేదు.కానీ విపరీతమైన పని ఒత్తిడి, అనవసరమైన ఇబ్బందులు అధికముతున్నవి.
7.ట్యూషన్స్ చెప్పే అధ్యాపకులు బాగానే డబ్బు దండుకుంటున్నారు కానీ మిగతా వారు అరకొర భత్యాలతో కాలం వెల్లదీస్తున్నారు.
8.దేశంలో వేల సమాఖ్య లో ప్రైవేట్ విద్యా సంస్థల లో పనిచేస్తున్న అధ్యాపకుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం గానీ, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గానీ సరి ఐన చర్యలు తీసుకోవడం లేదు.
9.విద్యాసంస్థల సంఖ్యా ప్రతి ఏడాదీ గణనీయంగా పెరుగుతున్నప్పటికీ ఉపాధ్యాయుల కు ఉపాధి ప్రశ్నార్థకం గా మారుతోంది.ప్రతిభావంతులు అధ్యాపక వృతి ని స్వీకరించడానికి మొగ్గు చూపడం లేదు.ఉపాధ్యాయ వృత్తి కేవలం సమయాన్ని వెచ్చిన్చాదానికో, ఒక వ్యాపకం గానో, సొంత పనులు చేసుకోవటానికి చాలా ఖాళీ సమయాన్ని అందించే ప్రత్యేక ఉద్యోగ్మ్గానో,నిరుద్యోగులు తమకు తమ అంచనాలకు తగ్గ జీతమిచే ఉద్యోగం దొరికేంతవరకు ఉపాధినిచ్చే తాత్కాలిక మార్గం గానో మారుతోంది తప్ప దేశాభివృద్ధికి భాద్యత గలిగిన సుశిక్షితులైన రేపటి తరం పురులనందించే పవిత్ర వృతి గా పరిగానిన్చాబదుట లేదు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి