బౌద్ధ మతం చాలా వరకు మన ఆలోచనలను మన ఆధీనంలో ఉంచుకోవటం ద్వారా నిత్య జీవితం లో ప్రశాంతతను పొందవచ్చని చెబుతోంది. ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్రం కూడా ఆధునిక జీవితంలో ఎదురయ్యే ఒత్తిడి ని ఎదుర్కోవడం లో ధ్యానం యొక్క ఆవశ్యకతను గుర్తించింది. మన లో చెలరేగే భావాలే మన భావోద్వేగాలకు కారణమౌతాయి.మన ఆలోచనలను జాగరూకతతో గమనిచడం వలన మంచి ఆలోచనలను మనకు మేలు కలిగించే భావోద్వేగాలను పెంపొందించుకునే అలవాటు చేసుకోవచ్చు. మనలో చెలరేగే ఆలోచనలను గురించి ఆలోచించ డాన్ని ఇంగ్లీష్ లో "మెటాకాగ్నిషన్" అంటారు. ఈ పదానికి సరి ఐన తెలుగు అర్థం నాకు స్ఫురించ లేదు.అంతర్జాలం లో వెతికినా దొరకలేదు. అందుకునే అసలైన ఆంగ్ల పదాన్ని ఇక్కడ వాడుతున్నాను.
మెటా కాగ్నిటివ్ ఆలోచనా విధానాన్ని అవలంబించడం ద్వారా మన కోప తాపాలను, ఇతర హానికారక భావోగ్వేదాలను మనం అదుపులో పెట్టుకోవచ్చు.విన్స్ పంజానో అనే ఆత్సాహికుడు నిర్వహిస్తున్న "ది హ్యాపీ హోమన్ క్యు లస్" అనే బ్లాగు లో ఈ మెటాకాగ్నిషన్ గురించిన విస్తృత సమాచారం లభిస్తోంది. నిత్య జీవితం లో ఉపయోగపడే సమాచారం గల కొన్ని మంచి పుస్తకాల గురించి కూడా ఈ బ్లాగ్ లో మనం తెలుసుకోవచ్చు.
ఆసక్తిగల వారు ఈ బ్లాగ్ అడ్రస్ ని అనుసరించగలరు.
http://www.happyhomunculus.com/

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి