ఈ వారం ఒక మంచి వెబ్సైటు గురించి వ్రాస్తున్నాను.ఈ మధ్య ట్విట్టర్ లో ఒక పొపులర్ రెట్వీట్ ను ఫాలో చేస్తే అది నన్ను డైలీ గుడ్ డాట్ కం కి తీసు కెళ్ళింది.డైలీ గుడ్ ట్విట్టర్ ఫోల్లోవేర్స్ లిస్టు చూస్తే అందులో లియోనార్డో డికాప్రియో లాంటి అంతర్జాతీయ ప్రముఖులున్నారు.తరువాత నేను కూడా ఆ వెబ్సైటు ని అనుసరించడం మొదలు పెట్టా.ప్రతి రోజూ ఈ వెబ్సైటు నుంచి ఏదో ఒక విషయం గురించిన మెయిల వస్తుంది.నాకు ఇటీవల బాగా నచిన ఒక ఆర్టికల్ లింక్ ఇక్కడ పొందుపరుస్తున్నా :సంతోషం గా ఉండడానికి త్యజించ వలసిన పదహైదు విషయాలు.
ఈ వెబ్సైటు గురించి మరింత తెలుసుకోగోరి వారి అబౌట్ అస్ పేజి కి వెళ్ళా. అక్కడ లభించిన సమాచారం ప్రకారం డైలీ గుడ్ డైలీ గుడ్ వెబ్సైటు ఒక కాలేజ్ స్టూడెంట్ చేత 1998 కొన్ని మానసిక ఉల్లాసాన్ని కలిగించే విషయాలను ఇతరులతో పంచుకోవాలనుకునే ఉద్దేశ్యం తో స్థాపింపబడింది.నేటికి ఈ వెబ్సైటు చందా దారుల సంఖ్య దాదాపు గా ఒక లక్ష కు పైచిలుకే.డైలీ గుడ్ వెబ్సైటు ద్వారా ప్రపంచంలో ఉన్న పలు గొప్ప వ్యక్తుల విజయ గాథలను చదివి మన నిత్య జీవితంలో ఆశ్హావాహ దృక్పథం తో ముందుకు సాగే ప్రేరణ పొందవచ్చు.
వెబ్సైటు నిర్వాహకులు చాలా "నీవు ఇతరులలో చూడాలనుకున్న మార్పు ను నీ నుండే ప్రారంభించు" సరళమైన తత్వంతో తమ కార్య కలాపాలను కొనసాగిస్తున్నారు.ఈ వెబ్సైటు కోసం పనిచేస్తున్న వారందరూ స్వచ్చందంగా తమ సేవలు అందిస్తున్న వారే.ఇక్కడ లభించే సమాచారమంతా అంతర్జాలంలో ఇతర సైట్ లకు ఉచితం గా పంపబడుతున్నది.ఎటువంటి ప్రకటనలు లేకుండా కేవలం సహజంగా ప్రజాదరణ లభిస్తే చాలనుకుని ఈ సైట్ ను నిర్వహిస్తున్నారు పోషకులు.
ఆసక్తి గల వారు ఒక సారి డైలీ గుడ్డ్ ని సందర్శించగలరు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి