థామ్సన్ రాయిటర్స్ సంస్థ సహకారంతో టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ సప్లిమెంట్ ప్రకటించిన ప్రపంచం లో ని నాలుగు వందల ఉత్తమ శ్రేణి విశ్వ విద్యాలయాల జాబితా (౨౦౧౨ సంవత్సరానికి)లో మన దేశానికి చెందిన మూడు విశ్వవిద్యాలయాలకు మాత్రమే చోటు దక్కింది.మూడూ ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ లె కావడం గమనార్హం.
మన దేశం లో వందల సంఖ్యలో ఉన్న ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో ఏ ఒక్కటీ ఈ జాబితా లో చేర్చబడలేదు.దీనికి కారణాలు చాలా ఉండవచ్చు.ఇక్కడ ప్రస్తావించడం పెద్దగా ఉపయోగించక పోవచ్చు.ఐ ఐ టీ ల లాంటి అత్యుత్తమ శ్రేణి విశ్వవిద్యాలయాల మినహా మిగతా విశ్వవిద్యాలయాలలో నాణ్యత లోపించడం ఒక కారణమా? ఐ ఐ టీ లలో పట్టభద్రులైన చాలా మంది ప్రతిభావంతులు ఈ జాబితా లో ని పాశ్చాత్య విశ్వవిద్యాలయాలలో పరిశోధకులు గానూ, అధ్యాపకులు గాను పనిచేస్తున్నారనేది జగమెరిగిన సత్యం.పరిశోధన పరం గా మన దేశం చైనా,కొరియా,జపాన్,సింగపూర్ లాంటి ఆసియా దేశాలకంటే చాలా వెనుకబడి ఉంది.పాశ్చాత్య దేశాలు విశ్వవిద్యాలయాలు తమ విద్యార్థులకు పరిశోధనాత్మక బోధనను అందిస్తూ వారిని ప్రపంచంలో నే అత్యంత ప్రతిభావంతమైన నిపుణులుగా తయారు చేస్తున్నాయి.అక్కడి విశ్వ విద్యాలయాలలో అండర్ గ్రాడుయేట్ స్థాయి నుంచే విద్యార్థులు పరిశోధనాత్మక వ్యాసాలను జర్నల్స్ లో ప్రచురించడం, కాన్ఫరెన్స్ ల లో తమ పరిశోధన విశేషాలను పంచుకోవడం లాంటి పనులను మంచినీళ్ళు త్హగినంత అలవోక గా చేసేస్తున్నారు.కానీ మన కాలేజి లు, విశ్వవిద్యాలయాలలో ఈ స్థాయి కి చేరడం ప్రస్తుతానికి ఎం.ఫిల్,పి .హెచ్.డి పరిశోధకులకు మాత్రమే వీలవుతోంది.విద్యార్థులలో పరిశోధనాత్మక దృక్పథాన్ని పెంపొందించడం లో ఎందుకనో మనం వెనుకబడి ఉన్నాం.మంచి పరిశోధనలు జరగక పోతే శాస్త్ర సాంకేతిక రంగంలో స్వయం ప్రతిపత్తి సాధించ గలగడం,అభివృద్ధి చెందినా దేశాలలతో పోటీ పడడం ఒక కల లాగే మిగిలి పోవచ్చు. మన దేశం ప్రపంచంలో ని అగ్ర దేశాల జాబితాలో నిలవాలంటే పరిశోధన రంగానికి ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఎంతైనా ముఖ్యం.
కానీ ఉన్నత విద్యలో ప్రభుత్వ పెట్టుబడులను క్రమేణా తిగ్గించే సూచనలు స్పష్టం గా కనిపిస్తున్నై.కర్ణాటక ప్రభుత్వం డిసెంబర్ నెలలో ఎకమగా 13 ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు ఆమోదం తెలపడం, మహారాష్ట్ర కూడా అదే బాటలో పయనిస్తుండడం, తమిళ నాడు లో కూడా ప్రైవేటు విశ్వవిద్యాలయాలు భారీగా రంగంలో కి రావడం ఈ భావన కు ఊతం ఇస్తోంది.ఇది వరకూ యు.జి.సి గుర్తింపు పొందిన కోర్సుల పట్ల మాత్రమే మొగ్గు చూపిన ప్రజానీకం ఉన్నత విద్యాభ్యాసానికి ప్రైవేటు విశ్వవిద్యాలయాలను ఎంచుకుంటుందో లేదో. కొద్ది రోజులలో తెలియబోతోంది.రాబోయే రోజులలో భారత ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు సూచనల మేరకు విద్యారంగం లో భారీ ఎత్తున విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానిన్చానుందని మీరా నంద రాసిన "ది గాడ్ మార్కెట్" అనే పుస్తకం లో పేర్కొన్నారు.దేశం లో ని చాలా కళాశాలలు విశ్వవిద్యాలయాలు రాజకీయ నాయకులో, వారి కుటుంబ సభ్యులో,అనుయాయులో నడుపుతుండడం వలన విద్యా రంగం లో విదేశీ పెట్టుబడులను ఆమోదించే బిల్లు ను గత పది పదిహేనేళ్ళుగా చట్టసభలలో ఆమోదించడం కష్టతరం అవుతోంది.విపరీతంగా ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు అనుమతులివ్వడం ద్వారా పరోక్షంగా ప్రభుత్వం విదేశీ విశ్వవిద్యాలయాలు మన దేశం లో నేరు గా ప్రవేశించే అవకాశాన్ని కల్పిస్తుందేమో అనిపిస్తోంది.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి