ఒక మీటర్ లో 100,000,00,00,000 వ వంతును (ఒన్ బిల్లియంత్ అఫ్ ఏ మీటర్) ను నానో మీటర్ అని పిలుస్తాం.వికీపీడియా ప్రకారం ఒక నానో మీటర్ ఒక మీటర్ లో లక్ష కోటవ వంతుకు సమానం.అంటే ఒక మీటర్ ను లక్ష కోట్ల సమభాగాలు గా విన్హజిస్తే , ప్రతిభాగం ఒక నానో మీటర్ కొలతను కలిగి ఉంటుందన్న మాట.ఈ వికీపీడియా వ్యాసం లో "నానో టెక్నాలజీ" ని "పరమాణు సూక్ష్మ సాంకేతిక పరిజ్ఞానం" గా పేర్కొన్నారు.
ఒక నానో మీటర్ నుంచి నూరు నానో మీటర్ల పరిమాణం లో ఉన్న పదార్థాలను నానో రేణువులు(నానో పార్టికల్స్) అని అంటారు.ఒక నానో మీటర్ నుంచి నూరు నానో మీటర్ల పరిమాణం గల పదార్థాలను ,వస్తువులను, రేణువులను, యంత్రాలను తయారు చేయడం,ఆ పరిమాణం గల వస్తువులను మార్పులకు గురి చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని నానో టేక్నాలజీ అని పిస్తారు.ఇటీవలి కాలం లో నానో టెక్నాలజీ రంగం బాగా వ్యాప్తిలోకి వచ్చింది.సౌందర్య సాధనాలు,ఆహార పదార్థాలు, కంపూటర్లు,టీవీ ల లాంటి వినోద సాధనాలు,పెయింట్ , ఆహార పదార్థాల తయారీ, ఆయుధాల తయారీ, సమాచార ప్రసార వ్యవస్థ , వైద్య రంగం లో నానో టెక్నాలజీ వినియోగం వలన రానున్న రోజులలో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి.
భారత ప్రభుత్వం కూడా ఈ రంగంలో పరిశోధనలను అనేక విధాలుగా ప్రోత్సహిస్తోంది.యూరోపియన్ కమిషన్ దేశాలు,అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఇజ్రాయెల్, ఫ్రాన్స్, చైనా, జపాన్, జర్మనీ ఇంకా ఇతర దేశాలకు చెందిన పరిశోధన సంస్థలు, పరిశ్రమలు ఈ నానోటెక్నాలజీ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కొత్త పరికరాలను తయారు చేసే పని లో నిమగ్నమై ఉన్నాయి.ఈ నానోటేక్నాలజీ గురించి మరింత సమాచారం తెలుసుకోగోరే వారు పైన ప్రస్తావించిన వికీపెడియా లంకె ను అనుసరించగలరు.
ఇప్పటికే మనోన్మణియన్ సుందరనార్ యూనివర్సిటీ లాంటి కొన్ని విద్యాసంస్థలు నానో బయో టేక్నాలజీ కోర్సులను అందిస్తునాయి. ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగంలో "కీడెంచి మేలెంచు" అనే దృక్పథం ప్రస్తుతానికి చాలా తక్కువమంది శాస్త్రవేత్తలు, వ్యాపార వేత్తలకు మాత్రమె ఉంది.కొన్ని నూతన పరికరాలను , నూతన శాస్త్ర విజ్ఞానాన్ని వాడేటప్పుడు కొత్త పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వలన కలిగే స్వల్ప కాలిక దీర్ఘ కాలిక పర్యవసానాలను అంచనా వేయడం,అధ్యయనం చేసి సమగ్ర మైన వ్యక్తిగత ,సామాజిక ,పర్యావరణ భద్రతకు సంబంధించిన అంశాలను క్రోడీకరించి జనసామాన్యానికి అందుబాటులో ఉంచడం చాలా అవసరం.
ఏ పదార్థాన్నయినా అతి సూక్ష్మ స్థాయి లో మార్పు చేస్తున్నప్పుడు అను రేణువుల స్థాయి లో పదార్థ ప్రవర్తన,స్వభావం చాలా మార్పులను చూపిస్తుంది.పరమాణు సూక్ష్మస్థాయి రేణువుల ఉపరితల వైశాల్యం చాలా ఎక్కువగా ఉండడం తో అవి భౌతిక రసాయనిక చర్యలలో అతి వేగంగా పాల్గొని ప్రాణ హాని కలిగించే విష పదార్థాలుగా పరివర్తన చెంది వివిధ ఆరోగ్య సమస్యలను కలిగించ వచ్చు.2008 మార్చి మాసం లో సైంటిఫిక్ అమెరికన్ పత్రిక ప్రచురించిన కథనం ప్రకారం ఫ్రెండ్స్ అఫ్ ఎర్త్ అనే పర్యావరణ సంస్థ దాదాపు వంద వరకూ నానో టెక్నాలజీ ఆధారిత ఆహారపదార్థాలు అమెరికన్ మార్కెట్లో వినిమయములో ఉన్నట్లు గుర్తించింది. ఈ కథనం ప్రకారం ఎన్విరోన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ 2005 లో జరిపిన ప్రయోగాలలో జింక్ ఆక్సైడ్ నానో రేణువులు అతి తక్కువ పరిమాణం లో కూడా మానవుని ఊపిరితిత్తుల కణాలకుసంబంధించిన సమస్యలను కలిగిస్తాయని తేలింది.ఎలుకలపై జరిపిన మరికొన్ని ప్రయోగాలలో వెండి నానో రేణువులు కాలేయ కణాలు, మెదడు లోని కణాలను చంపివేసే సామర్థ్యాన్ని కలిగిఉన్నాయని కనుగొన్నారట.
గత కొద్ది కాలం గా అంతర్జాలం లో మరియు సైంటిఫిక్ జర్నల్స్ లో ప్రచురితమౌతున్న పరిశోధనాత్మక వ్యాసాలు నానో టెక్నాలజీ లో భద్రతా పరమైన చిక్కులు తలెత్తే ప్రమాదం ఉండబోతుందని హెచ్చరిస్తున్నాయి.నానో టెక్నాలజీ ఉత్పత్తులు వాడే వినియోగదారులు, తయారీ లో పాల్గొనే ఉద్యోగులు, నిపుణులు, నానో టెక్నాలజీ ఆధారిత వ్యర్థ పదార్థాల ప్రభావానికి లోనయ్యే వారు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం ఉంది.ఈ కొత్త సాంకేతిక శాస్త్ర ఆధారిత ఉత్పత్తులను భారీ ఎత్తున తయారు చేసి మార్కెట్లోకి వదిలేముందు భద్రతా పరమైన అంశాలపై కూడా సమగ్ర పరిశోధనలు జరపాల్సిన భాద్యత ప్రభుత్వాలకు, శాస్త్ర వేత్తలకు ఉన్నది. మరిన్ని వివరాలకు పార్టికల్ అండ్ ఫిబెర్ టాక్సికాలజీ అనే అంతర్జాల జర్నల్ 2006 లో ప్రచురించిన "ది పోటేన్శిఅల్ రిస్క్స్ అఫ్ నానో మటీరియల్స్: ఏ రివ్యూ కారీడ్ అవుట్ ఫర్ ఈసిఈటిఈసి" అనే పేరుతో ప్రచురించిన వ్యాసాన్నిచదవగలరు.

చక్కటి విషయాలను తెలియజేశారు.
రిప్లయితొలగించండిఅందరూ తప్పక ఆలోచించవలసిన విషయాలివి.
దయచేసి నాకు అంటిబయోటిక్స్ గురించి వాటి రకాల గురించి అన్నింటికన్నా ముఖ్యంగా ఏ అంటిబయోటిక్ని ఏ రోగానికి ఏలా వాడాలో దయచేసి తెలుగులోనే తెలుపగలరు.ధన్యవాదాలు
రిప్లయితొలగించండికేటలాగులు చూసి మందులు మింగటం అనేది ప్రాణాంతకమైన తప్పుడు ఆలోచన అని దయచేసి గ్రహించ ప్రార్థన.అలాగే మీకు ఎవరైనా డాక్టరు గారు ఇచ్చిన మందులను అలాంటి లక్షణాలే ఉన్నాయికదా అని ఉదారంగా మీ బంధుమిత్రులకు వాటిని వాడమని సూచించటం కూడా ఘోరమైన ప్రాణాంతక ప్రమాదాలకు దారితీయవచ్చుననీ గ్రహించ ప్రార్థన. ధన్యవాదాలు.
తొలగించండి