బెంగళూరు అనగానే మనలో చాలా మందికి వెంటనే గుర్తుకొచ్చేవి విలాసవంతమైన భవంతులు, ఆకాశ హర్మ్యాలు,సాఫ్ట్ వేర్ ఆఫీసులు, ఇంజినీర్లు,వందల సంఖ్యలో ఉన్న కాలేజి లు, తిండి విషయానికి వస్తే ఆధునిక బహుళ జాతి ఫాస్ట్ ఫుడ్ దుకాణాలు, షాపింగ్ మాల్స్ ఇవన్నీ.కానీ బెంగళూరు నగరం ఆధునికతకు ప్రతీకగా నిలుస్తున్నప్పటికీ, ఈ నగరానికి మనందరికీ చాలా సులభంగా తెలిసే మరొక కోణం కూడా ఉంది.అదే ఇక్కడి సాంప్రదాయక చిరుతిళ్ళ అంగళ్ళు, కొన్ని దశాబ్దాలు గా వినియోగదారులను అలరిస్తున్న అల్పాహార ఉపాహార శాలలు.
బెంగళూరులో సాయంత్రం పూట రోడ్డు పై కి అడుగిడుతూనే ఫుట్ పత ల పై, హోటళ్ల్ల ముంగిట్లో కిట కితలాడుతూ జనం కనిపిస్తారు.బహుశా సాఫ్ట్ వేర్ సంస్థలు,రియల్ ఎస్టేట్,విద్యా సంస్థల తరువాత అంత భారీ స్థాయిలో వ్యాపారం జరిగేది అల్పాహార, ఉపాహార శాలలు మరియు భోజన శాలలో మాత్రమేనేమో.ఇక్కడ స్వాతంత్ర్య పోరాట కాలం నుంచీ , అంటే దాదాపు ఒక శతాబ్ద కాలం నుంచీ విజయవంతం గా నిర్వహించ బడుతున్న అనేక చారిత్రాత్మక హోటల్స్ ఉన్నాయి.కొన్ని హోటల్స్ ని జవహర్ లాల్ నెహ్రు,రాజాజీ లాంటి మహామహులు సందర్శించి న దాఖలల్లు కూడా ఉన్నాయి.సూపెర్ స్టార్ రజనీ కాంత్ స్వస్థలమైన బెంగళూరు కు వచ్చిన ప్రతి సారీ తనకు నచ్చిన చిన్న చిన్న హోటల్స్ కి వెళ్ళుతుంటారని అప్పుడప్పుడూ ప్రచార మాధ్యమాల ద్వారా తెలుస్తుంది.
బెంగళూరు మహానగరం శాఖాహార భోజనశాలలకు పెట్టింది పేరు.(ఇప్పుడు ఈ మాట అనడం చాలా కష్టం అనుకోండి.ఎందుకంటే,పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న బహుళ జాతి ఆహార విక్రయశాలలకు ప్రధాన కేంద్రం గా నూ పరిగనిణ్చ బడవచ్చు).ముఖ్యంగా బెంగళూరు దక్షిణ భాగం లో చాలా చిన్న చిన్న దక్షిణ భారత శైలి హోటల్స్ ఉన్నాయి.వీటిలో ప్రధానం గా సున్నితంగా ఉన్న కర్నాటక శైలి ఇడ్లీలు , కరకర లాడే మినప వడలు, చౌ చౌ బాత్ (కేసరి , ఉప్మా ల కాంబినేషన్ ),పులియోగరే( పులిహోర కర్నాటక వెర్షన్ ), అవలక్కి బాత్( అటుకుల , ఘుమ ఘుమ లాడే రుచికరమైన ఫిల్టర్ కాఫీ, టీ దొరుకుతాయి.బసవన గుడి, గాంధి బజార్,హనుమంత్ నగర్,జయ నగర్, బనశంకరి ౨ వ స్టేజ్ లలో ఇలాంటి హోటల్స్ చాలా ఉన్నాయి.
నిన్న మిత్రుల తో కలిసి ఎన్ ఆర్ కాలనీ లో ఉన్న ద్వారకా వెజ్ కి వెళ్లాను.మిత్రులు ప్రోఫ్.జయ రామ రెడ్డి గారు కాలేజ్ లో ని సివిల్ ఇంజినీరింగ్ విభాగం లో చేరి ఒక సంవత్సర కాలం గడిచిన సందర్భాన్ని పురస్కరించిఉకొని మాకు ద్వారక లో చిన్న విందు ఇచ్చారు.నేను తరచూ ఈ ప్రాంతంలో నే తిరుగుతున్నప్పటికీ ఎప్పుడూ ఈ హోటల కి వెళ్ళలేదు.రెడ్డి గారి స్వస్థలం బెంగళూరు కావడం వాళ్ళ వారికి ఇలాంటి ప్రదేశాలన్నీ చిర పరిచితాలు.వారి పుణ్యమా అని అక్కడ టిఫిన్ చేసే అవకాశం దొరకడం తో ఈ హోటల్ గురించి మిత్రుల ప్రోత్సాహం తో బ్లాగ్ పోస్ట్ రాస్తున్నాను.
ఇక్కడ ముఖ్యంగా ఖాళి దోస బాగా అమ్ముదవుతూ ఉంటుంది.మేము ఖాళి దోస తో పాటు కారెట్ హల్వా , కాఫీ పుచ్చుకున్నాం.ఖాళీ దోస అంటే తెలుగులో సాదా దోస లేదా ప్లెయిన్ దోస లాంటిది.కానీ కొంచెం మందం గా సుతి మెత్త గా ఉంటుంది.అదనపు చట్నీ అవసరం అయినప్పుడు అపరిమితం గా చట్నీ ఇస్తూనే ఉంటారు (అంటేమనం దోస తినే వరకు అన్న మాట).చట్నీ వడ్డించా డానికి ఒక ప్రత్యేకమైన సర్వర్ కూడా ఉంటాడు.ఇలాంటి వడ్డన విషయంలో తమిళ నాడు లోని కొన్ని హోటల్స్ తో పోలిస్తే ఇక్కది హోటల్స్ వారు కొంత పట్టు విడుపు గా ఉంటారు అనే చెప్పొచు.చాలా పాత కాలం హోటల్ కనుక ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ హోటల్స్ లాగా మనం వేగంగా నిలుచుకొని తినేటన్దుకే కాకుండా సౌకర్యవంతం గా కూర్చుని తినే వెసులుబాటు కూడా ఉంది.దోస తో ఇడ్లి,ఉత్తర భారత తినుభందారాలు,పూరీ ల లాంటి ఇతర పదార్థాలు దొరుకుతున్నప్పటికీ కస్టమర్స్ అందరూ ఖాళి దోస మాత్రమె కొనడం చోసాను.కౌంటర్లో ఉన్నవారు వేడి వేడి పూరీ కూడా ఉంది అంటున్నప్పటికీ అందరూ దోస వైపే మొగ్గు చూపడం కనిపించింది.దీన్ని బట్టి ఇక్కడి దోస నాణ్యత అంచనా వెయ్యవచ్చనిపించింది.ఒకప్పుడు ఈ హోటల లో కస్ట్అమర్ల కు సూచనలిచ్చే అనేక బోర్డులున్దేవట అందుకని ఒకప్పుడు దీన్ని బోర్డ్ హోటల్ అనేవారట! ఇప్పుడు ఆ బోర్డులు లేవు లెండి.ఇప్పుడు ఈ హోటల్ ను కొత్తగా పునర్నిర్మించారు.
ఈ హోటల్ ఎన్ ఆర్ కాలనీ నుంచి హనుమత్న్త నగర వెళ్ళే దారిలో ఎడం వేపు కనిపిస్తుంది.
సజ్జన్‌రావ్ సర్కిల్ దగ్గర ఓ వీధి మొత్తం తినుబండారాలే ఉంటాయి, దాన్నిక్కడ ఫుడ్ స్ట్రీట్ అంటారు, అక్కడకూడా ఎప్పుడైనా ట్రై చెయ్యండి :)
రిప్లయితొలగించండిసూర్యుడు గారూ,సూచనకు ధన్యవాదం.సజ్జన్రావు సర్కిల్ గురించి నాకు గత పదిహేనేళ్ళ నుంచి తెలుసు. మున్ముందు అక్కడికి వెళ్ళినప్పుడు మీరు సూచించినట్టు నాకు ఆసక్తికరమైన తినుబందారాలపై తప్పక వ్రాస్తాను :)
రిప్లయితొలగించండి