2, జులై 2012, సోమవారం

మంచి వెబ్ సైట్ : డైలీ గుడ్

ఈ వారం ఒక మంచి వెబ్సైటు గురించి వ్రాస్తున్నాను.ఈ మధ్య ట్విట్టర్ లో ఒక పొపులర్ రెట్వీట్ ను ఫాలో చేస్తే అది నన్ను డైలీ గుడ్ డాట్ కం కి తీసు కెళ్ళింది.డైలీ గుడ్ ట్విట్టర్ ఫోల్లోవేర్స్ లిస్టు చూస్తే అందులో లియోనార్డో డికాప్రియో లాంటి అంతర్జాతీయ ప్రముఖులున్నారు.తరువాత నేను కూడా ఆ వెబ్సైటు ని అనుసరించడం మొదలు పెట్టా.ప్రతి రోజూ ఈ వెబ్సైటు నుంచి ఏదో ఒక విషయం గురించిన మెయిల వస్తుంది.నాకు ఇటీవల బాగా నచిన ఒక ఆర్టికల్ లింక్ ఇక్కడ పొందుపరుస్తున్నా :సంతోషం గా ఉండడానికి త్యజించ వలసిన పదహైదు విషయాలు.
               ఈ వెబ్సైటు గురించి మరింత తెలుసుకోగోరి వారి అబౌట్ అస్ పేజి కి వెళ్ళా. అక్కడ లభించిన సమాచారం ప్రకారం డైలీ గుడ్ డైలీ గుడ్ వెబ్సైటు ఒక కాలేజ్ స్టూడెంట్ చేత 1998 కొన్ని మానసిక ఉల్లాసాన్ని కలిగించే విషయాలను ఇతరులతో పంచుకోవాలనుకునే ఉద్దేశ్యం తో స్థాపింపబడింది.నేటికి ఈ వెబ్సైటు చందా దారుల సంఖ్య దాదాపు గా ఒక లక్ష కు పైచిలుకే.డైలీ గుడ్ వెబ్సైటు ద్వారా ప్రపంచంలో ఉన్న పలు గొప్ప వ్యక్తుల విజయ గాథలను చదివి మన నిత్య జీవితంలో ఆశ్హావాహ దృక్పథం తో ముందుకు సాగే ప్రేరణ పొందవచ్చు.
    వెబ్సైటు నిర్వాహకులు చాలా "నీవు ఇతరులలో చూడాలనుకున్న మార్పు ను నీ నుండే   ప్రారంభించు" సరళమైన తత్వంతో తమ కార్య కలాపాలను కొనసాగిస్తున్నారు.ఈ వెబ్సైటు కోసం పనిచేస్తున్న వారందరూ స్వచ్చందంగా తమ సేవలు అందిస్తున్న వారే.ఇక్కడ లభించే సమాచారమంతా అంతర్జాలంలో ఇతర సైట్ లకు ఉచితం గా పంపబడుతున్నది.ఎటువంటి ప్రకటనలు లేకుండా కేవలం సహజంగా ప్రజాదరణ లభిస్తే చాలనుకుని ఈ సైట్ ను నిర్వహిస్తున్నారు పోషకులు.
ఆసక్తి గల వారు ఒక సారి డైలీ గుడ్డ్ ని సందర్శించగలరు.

10, జూన్ 2012, ఆదివారం

నేటి తరం కాలేజిలు,విద్యార్థులు, అధ్యాపకులు

నేను టీచింగ్ వృత్తి లో ప్రవేశించి ఖచ్చితం గా ఒక దశాబ్దం కావస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ లో ని చిత్తూరు జిల్లాలో ఇంటర్మీడియట్ వరకు చదివి మైక్రోబయాలజీ లో డిగ్రీ చెయ్యడానికి బెంగళూరు వచ్చాను.వచ్చిన కొద్ది రోజుల వరకూ ఈ ఊరి కొత్త దనం తగ్గలేదు.ముఖ్యం గా ఇక్కడి పి.యు.సి స్టూడెంట్స్ ని ,వారి అల్లోచనలు, సాహసాలు చూసి చాలా ఆశ్చర్య పడే వాణ్ని.ఆంద్ర లో అయితే అప్పట్లో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ని కొట్టే వారు కూడా.కానే బెంగళూరు వచ్చిన తరువాత మా కాలేజి లో  నేను చూసిన గోడవలన్నీ పి.యు.సి వాళ్ళు చేసేవే.
           ఏదో లాగా డిగ్రీ ముగించిన తరువాత అదే కాలేజి లో ఎం.ఎస్.సి చేసే భాగ్యం కూడా కలగడం తో అది కూడా పూర్తి చేసి పదేళ్ళ క్రితం బెంగళూరు మహానగరం లో ని ఒక కాలేజి లో మైక్రోబయాలజీ అధ్యాపకుడి గా చేరాను.నేను చేరిన కొత్తలో ఇక్కడ  ఎం.ఎస్.సి చేయడానికి మన ఆంధ్ర ప్రదేశ్ నుంచి ఎక్కువ స్టూడెంట్స్ వచ్చేవారు.గత రెండు సంవత్సరాల నుంచి ఈ ఆంధ్ర స్టూడెంట్స్ సంఖ్య తగ్గిపోయింది.ఇప్పుడు మా కాలేజి కి అడ్మిషన్స్ తీసుకోచ్చే ఏజెంట్ మహారాష్ట్ర స్టూడెంట్స్ ని ఎక్కువ గా తీసుకొస్తున్నాడు.
      ఈ లోగా మా కాలేజి లో ఒక చిన్న సంఘటన జరిగింది.నాతో పాటు గత కొద్ది సంవత్సరాలు గా కాలేజి రూట్ బస్సు లో నేనున్న ఏరియా నుంచి ఒక సీనియర్ ప్రొఫెసర్ ప్రయాణించే వారు.ఇటీవలే ఆయన తన డిపార్టుమెంటు లో సహోద్యోగుల రాజకీయాలు, స్టుడేంట్ల కృతజ్ఞతా రాహిత్యం, గురు భక్తి ఏ కోశానా వారి లో కనిపించక పోవడం వంటి కొన్ని విషయాలతో విసిగి వేసారి తాను అధ్యాపక వృత్తి నుంచి శాశ్వతం గా తప్పుకుంటున్నట్లు గత వారం ఫేస్ బుక్ లో ప్రకటించారు.దాని తరువాత చాలా మంది ప్రస్తుత ,పూర్వ విద్యార్థులు ఆశ్చర్యం,విభ్రమ తో కూడిన వ్యాఖ్యలు చేయడం కూడా చదివాను.
    ఈ సంఘటన జరిగిన తరువాత నా లో ఎప్పటి నుంచో బలంగా నాటుకు పోయిన కొన్ని అభ్ప్రాయాలు మరింత బలపడ్డాయి.అవేమంటే,
1.ఆధునిక భారత దేశమ లో పెరుగుతున్న జనాభా కు అనుగుణంగా అధిక సమాఖ్య లో కొత్త విద్యా సంస్థల అవసరం ఉంది.
2.కోకొల్లలు గా పుట్టుకు వస్తున్న కొత్త కాలేజీలు, డీమ్డ్ యునివర్సిటీల మధ్య అడ్మిషన్ల కోసం చాలా అనారోగ్యకరమైన పోటీ నెలకొని వుంది.
౩.విద్యా రంగంలో భారీ పెట్టుబడులను పెడుతున్న పారిశ్రామిక వేత్తలు,రాజకీయ నాయకులు, పెట్టుబడులతో సమానమగా లాభాలను,కీర్తిని ఆశిస్తూ బోధనా సిబ్బంది తరువాత బోధనేతర సిబ్బంది పై విపరీతమైన ఒత్తిడి తెస్తున్నారు.
4.విద్యార్థులు,తల్లి తండ్రులలో కూడా విద్య పట్ల ఒక రకమైన వ్యాపార ధోరణి నెలకొని ఉంది.
5.విద్యా సంస్థల యాజమాన్యాలు,తల్లి దండ్రులు,విద్యార్థులు విద్య యొక్క పరమావధి ప్లేస్మెంట్స్ అయినట్లు ప్రవర్తిస్తున్నారు.
6.ఈ ధోరణి వలన విద్యా వ్యవస్థలో భారీ గా విలువల పతనం జరుగుతోంది.అధ్యాపకులకు సరి ఐన జీత భత్యాలు దొరకడం లేదు.కానీ విపరీతమైన పని ఒత్తిడి, అనవసరమైన ఇబ్బందులు అధికముతున్నవి.
7.ట్యూషన్స్ చెప్పే అధ్యాపకులు బాగానే డబ్బు దండుకుంటున్నారు కానీ మిగతా వారు అరకొర భత్యాలతో కాలం వెల్లదీస్తున్నారు.
8.దేశంలో వేల సమాఖ్య లో ప్రైవేట్ విద్యా సంస్థల లో పనిచేస్తున్న అధ్యాపకుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం గానీ, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గానీ సరి ఐన చర్యలు తీసుకోవడం లేదు.
9.విద్యాసంస్థల సంఖ్యా ప్రతి ఏడాదీ గణనీయంగా పెరుగుతున్నప్పటికీ ఉపాధ్యాయుల కు ఉపాధి ప్రశ్నార్థకం గా మారుతోంది.ప్రతిభావంతులు అధ్యాపక వృతి ని స్వీకరించడానికి మొగ్గు చూపడం లేదు.ఉపాధ్యాయ వృత్తి కేవలం సమయాన్ని వెచ్చిన్చాదానికో, ఒక వ్యాపకం గానో, సొంత పనులు చేసుకోవటానికి చాలా ఖాళీ సమయాన్ని అందించే ప్రత్యేక ఉద్యోగ్మ్గానో,నిరుద్యోగులు తమకు తమ అంచనాలకు తగ్గ జీతమిచే ఉద్యోగం దొరికేంతవరకు ఉపాధినిచ్చే తాత్కాలిక మార్గం గానో మారుతోంది తప్ప దేశాభివృద్ధికి భాద్యత గలిగిన సుశిక్షితులైన రేపటి తరం పురులనందించే పవిత్ర వృతి గా పరిగానిన్చాబదుట లేదు.


12, ఫిబ్రవరి 2012, ఆదివారం

పాట్రిక్ ఫ్రెంచ్ రచన "ఇండియా- ఎ పోర్త్రైట్" 120 కోట్ల ప్రజల జీవిత చరిత్ర

గత చాలా రోజుల నుంచి మా కాలేజి లో ప్రోఫ్.జున్జప్ప అనే కెమిస్ట్రీ ఆచార్యుడు నాతో పాట్రిక్ ఫ్రెంచ్ అనే ఆంగ్ల రచయిత వ్రాసిన  "ఇండియా- ఎ పోరట్ రైట్" అనే పుస్తకం గురించి తరచూ ప్రస్తావిస్తూనే ఉన్నారు.ఈ మధ్య ఓ సారి ఆయనను కలిసినపుడు ఆ పుస్తకాన్ని ఓ సారి ఇస్తే చదివి ఇస్తానన్న్నాను.మరుసటి రోజే ప్రొఫెసర్ ఆ పుస్తకాన్ని నాకిచ్చారు.
   పాట్రిక్ ఫ్రెంచ్ టిబెట్ మీద,మన దేశం మీద మరియు ప్రఖ్యాత ఆంగ్ల రచయిత వి.ఎస్.నైపాల్ మీద పుస్తకాలు రాసినట్టు తెలుసుకున్నాను.మన దేశ చరిత్ర మీద,సంస్కృతీ సంప్రదాయాల మీద గత మూడు వందల సంవత్సరాల నుంచీ ఆగ్లేయ చరిత్రకారులు మాత్రమే లోతైన పరిశోధనాత్మక గ్రంథాలు రాస్తున్నారు.విల్లియం దార్లిమ్పుల్ లాంటి సమకాలీన ఆంగ్ల రచయితలు మన దేశంలోనే ఉంటూ, మన సామాజిక,రాజకీయ,ఆధ్యాత్మిక జన జీవన చిత్రణ చేస్తున్నారు.నేను ప్రస్తావిస్తున్న పాట్రిక్ ఫ్రెంచ్ కూడా ఈ కోవలోకి చెందిన వాడే.
  ఈ పుస్తకం చాడువుతూన్నంత కాలం, మన గురించి మన కంటే ఇతర దేశీయులకు మంచి అవగాహన ఉందనిపించింది. భారత దేశ సమకాలీన చరిత్ర పై ఒక మంచి పుస్తాన్ని చదవగోరే ప్రతి ఒక్కరికీ నిస్సంకోచంగా నేను ఈ పుస్తకాన్ని సిఫారసు చేస్తున్నాను. రాష్ట్ర,లక్ష్మి  మరియు సమాజ అనే మూడు భాగాలుగా విభాజిమ్పబడ్డ ఈ పుస్తకమ్ లో, మన పాలక వ్యవస్థ,ఆర్ధిక సామాజిక వ్యవస్థ ల లోని భిన్న కొణాల పై లోతైన విశ్లేషణ చదువవచ్చు.
 నేను చదివే పుస్తకాల ను అంతర్జాలంలో గూగుల్ చేయడం నాకు అలవాటు.పాట్రిక్ ఫ్రెంచ్ పుస్తకాన్ని గూగుల్ చ్సినపుడు బుకర్ అవార్డు గ్రహీత అరవింద్ అడిగ ది గార్డియన్ పత్రిక కోసం వ్రాసిన విమర్శనాత్మక వ్యాసం చదవడం జరిగింది.అరవింద్ అడిగ ఉద్దేశ్యం ప్రకారం ఈ పుస్తకం భారత దేశ కాల మాన పరిస్థుతులలో కేవలం అతి కొన్ని అంశాలను మాత్రమే ప్రస్తావిస్తుంది. ఏది ఏమైనప్పటికీ నాకు మాత్రం ప్రతి భారతీయ యువతీ లేద యువకుడు తప్పని సరిగా ఈ పుస్తకం చదవడం వలన చాలా లభ్ది పొందుతారనిపించింది.
   కానీ మన మీద మనమే యదార్థమైన పుస్తకాలు వ్రాసుకోవడం చాలా ముఖ్యం.విదేశీయుల దృక్పథం లో మన చరిత్రను చదివే దుస్థితికి త్వరలోనే అడ్డుకట్ట వేస్తే బావుంటుంది.
రచయిత చాయా చిత్రాన్ని http://www.thehindu.com/multimedia/dynamic/00358/16bglak-bookfrench__358472e.jpg నుంచి స్వీకరించడం జరిగింది.


18, జనవరి 2012, బుధవారం

హరుకి మురకమి నార్వేజియన్ వుడ్

డిసెంబర్ నుంచి మా ఇంటి దగ్గరలో ఉన్న "జస్ట్ బుక్స్" కమ్యూనిటీ లైబ్రరీ లో సభ్యత్వం తీసుకున్నా.మొదట జెఫ్రీ మూర్హౌస్ రాసిన "కాల్కతా" తీసుకున్నా చదివే ఓపిక లేక తిరిగి ఇచేసాను. ఆ తరువాత అద్దెకి తీసుకున్న పుస్తకాలలో నాకు బాగా నచ్చింది జపనీస్ రచయిత "హరుకి మురకమి" రాసిన "ది నార్వేజియన్ వుడ్".

    ఈ పుస్తకాన్ని మురకమి దాదాపు పాతికేళ్ళ క్రింద రాసారు.అతనని ఆధునిక రచయితలలో ఒకడిగా నిలబెట్టిందీ ఈ నవలే అని చెప్పొచ్చు.ఈ నవల కథా కాలం 1960 వ దశకం.ఆనాటి యువత ఆలోచనా ధోరణిని చాలా సరళంగా మనసుకు హత్తుకునే విధం గా మురకమి చిత్రీకరించారు. ముఖ్యంగా కొంత వేదాంతం,ప్రేమ , కొద్ది పాటి శృంగారం, హాస్యం కలగలిసిన కథ ఏకబిగిన చదివిస్తుంది.నాకు ఈ పుస్తకం చదివినంత సేపు మన వర్తమాన సూపర్ స్టార్ నవలాకారుడు చేతన్ భగత్ గుర్తుకు వస్తూనే ఉన్నాడు. అతను కూడా తన నవలలకు ఈ పుస్తకాన్నే ప్రేరణగా తీసుకున్నాడేమో అనిపించింది.కానీ నార్వేజియన్ వుడ్ చేతన్ భగత్ నవలలకంటే ఎన్నో రెట్లు బాగానే ఉంది.ఇంగ్లీష్ నవలలు చదివే అలవాటున్న ప్రతిఒక్కరూ తప్పని సరిగా చదవాల్సిన పుస్తకం ఇది.
క్లుప్తంగా కథలోకి వెళ్ళాలంటే ఇది తోరు వాతానాబే అనే ఒక వ్యక్తి యౌవన దశలో జరిగిన ప్రేమ,స్నేహం ఇతర సంఘటనలను, వివరిస్తుంది.మన తెలుగు లో ఇలాంటి పుస్తకాలు రాలేదనే అనుకుంటున్నాను.ఒక వేళ తెలుగు అనువాదం ఏదైనా ఉందేమో తెలియదు గానీ నాకు నచ్చిన పుస్తకాల్లో ఇది కూడా ఒకటి.

17, జనవరి 2012, మంగళవారం

పోస్ట్ సీక్రెట్ లో ఈ వారం జనవరి ౧౭ ౨౦౧౨

ఈ వారం నుంచి ప్రతి వారం పోస్ట్ సీక్రెట్ లో ని సీక్రెట్ ల గురించి ఒక పోస్ట్ వ్రాస్తాను.
ఈ వారం సండే సీక్రెట్  ల ను జనవరి 14 న ప్రచురించారు.

1.నాకు వివాహమై ఎనిమిది నెలలు కావస్తోంది.ఈ విషయం నా తల్లి తండ్రులకు తెలియదు.వారికి ఈ విషయాన్ని తెలుసుకొనే అర్హత లేదని భావిస్తున్నాను.

2.ఇదివరకు జీవిత భాగస్వామి కావాలనే ఒకే ఒక ఆలోచన తో పెళ్లి చ్సుకునే వారిని అసహ్యించు కునే వాడిని.కానీ ఇప్పుడు నేను కూడా వాళ్ళలో ఒక్కడిని అయ్యానని అనుకుంటున్నాను. . .

3.వాణ్ని పెళ్లి చేసుకోకు! వాడు స్వలింగ సంపర్కి!!

4.నాకు టీవీ షో "హౌస్" అంటె చచ్చేంత ఇష్టం.కానీ దాన్ని చూడడమే నాకు నచ్చదు.ప్రపంచంలో ఉన్న వ్యాధులన్నీ నాకే ఉన్నట్టుగా అనిపిస్తోంది.

5.నువ్వు నన్ని చేసినట్టు నా బాయ్ ఫ్రెండ్ చేత చేయించుకోవడానికి భయంగా ఉంది.

6.నేను దేవుడికి అతి చేరువలో ఉన్నట్టు అనిపించే ఒకే ఒక సమయం నేను మత్తు పదార్థాలను సేవించినప్పుడు  మాత్రమే.

7.నేను హస్త ప్రయోగం చ్సుకోవడానికి ప్రయత్నించాను కానీ అది పనిచేయలేదు.

8.కొన్ని సార్లు నా స్వేచ్చావాద స్నేహితుల మధ్యలోనుంచి నా దేశాన్ని ద్వేషించడం ఆధునికంగా అనిపిస్తుంది.అలా చేయడమ్ ద్వారా పిరికివాదడినవుతున్నాననిపిస్తోంది.

9.నిన్ను వెతకడం ఎలాగో నాకు భోద పడుటలేదు.కానీ నీ కోసం ఇంకా ప్రార్తిస్తూనే ఉంటాను.

10.నేను వెతుకుతోంది నాకు దొరుకుతుంది.

"బెస్ట్ అఫ్ ది అప్" అనే శీర్షిక కింద ఈ కింది సీక్రెట్స్  ప్రచురించబడి ఉన్నాయ్.
అతను నన్ను నేను నగ్నంగా ఉన్న ఫోటో పంపించమని కోరాడు. నేను ఈ ఫోటో పంపించాను. (ఫోటో లో "నేకెడ్ అంటి ఆక్సిడెంట్" అన్న బాటిల్ ఉంది)

 గత నలభై నిమిషాల నుంచి వీళ్ళు నన్ను పరిహస్తుంటే వింటూ కూర్చున్నా.నాకు వియత్నామీస్ వచ్చని వాళ్ళతో చెప్పాలా?











11, జనవరి 2012, బుధవారం

మంచి పుస్తకం: ది సెవెన్ స్పిరిచువల్ లాస్ అఫ్ సక్సెస్ (విజయానికి ఏడు ఆధ్యాత్మిక సూత్రాలు)

యండమూరి వీరేంద్రనాథ్  విజయానికి ఏడు మెట్లు లాంటి చాలా వ్యక్తిత్వ వికాసం పుస్తకాలు రాసి తెలుగు చదువరుల లో ఈ  జానర్ ని బాగా వ్యాప్తి లోకి తెచ్చారు. నరసింహ రావు రచించిన "వ్యక్తిత్వ వికాసం" కూడా ఇదే కోవకు చెందినా ఒక మంచి పుస్తకం.ఇటువంటి పుస్తకాలు ఇంగ్లీష్ లో తరచూ వెలువడుతుంటాయి.చాలా ఏళ్ళ క్రితం ప్రవాస భారతీయ అధ్యాత్మిక గురువు,రచయిత డాక్టర్ .దీపక్ చోప్రా " ది సెవెన్ స్పిరిచువల్ లాస్ అఫ్ సక్సెస్ "((విజయానికి ఏడు ఆధ్యాత్మిక సూత్రాలు- రచయిత స్వేచానువాదం) అనే పుస్తకం వ్రాశారు.
      ఈ పుస్తకం గురించి చాలా మంది దగ్గర చాలా రోజుల నుంచి వింటున్నా నేను ఈ మధ్యనే చదవడం జరిగింది.ఇది చాలా చిన్న పుస్తకం.దీపక్ చోప్రా ఈ పుస్తకం లో మన నిత్య జీవితం లో మనం సంపదను సృష్టించడానికి,ఆరోగ్యం గా జీవించడానికి, చక్కటి మానవ సంబంధాలను పెంపొందించుకోవడానికి , మన వ్యక్తిగత సంతృప్తి కోసం ఉపయోగ పడే ఏడు సూత్రాలను చాలా సరళం గా , ఉత్తేజకరం గా వివరించారు. ఈ పుస్తకానికి తెలుగు అనువాదం ఉందొ లేదో తెలీదు కానీ నేను ఇంగ్లీష్ వెర్షన్ చదివాను.



   ఆఫీసు లో కొంచం ఒత్తిడి లో ఉన్నపుడు ఈ పుస్తకాన్ని చదవడం నాకు ఎంతో లాభించింది.ఏడు సూత్రాలలో వారం లో ప్రతి రోజు ఒక సూత్రాన్ని పాటించడం ద్వారా మనం చాలా ఉపయోగాలను పొందవచ్చు.
ఈ సెవెన్ స్పిరిచ్చువల్ లాస్ ని కింద వ్రాస్తున్నాను

1.Law of pure potentiality
2.Law of giving
3.Law of karma
4.Law of least effort
5.Law of Intention and desire
6.Law of detachment
7.Law of Dharma 

10, జనవరి 2012, మంగళవారం

బ్లాగు పరిచయం: ది హ్యాపీ హోమన్ క్యు లస్

బౌద్ధ మతం చాలా వరకు మన ఆలోచనలను మన ఆధీనంలో ఉంచుకోవటం ద్వారా నిత్య జీవితం లో ప్రశాంతతను పొందవచ్చని చెబుతోంది. ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్రం కూడా ఆధునిక  జీవితంలో ఎదురయ్యే ఒత్తిడి ని ఎదుర్కోవడం లో  ధ్యానం యొక్క ఆవశ్యకతను గుర్తించింది. మన లో చెలరేగే భావాలే మన భావోద్వేగాలకు కారణమౌతాయి.మన ఆలోచనలను జాగరూకతతో గమనిచడం వలన మంచి ఆలోచనలను మనకు మేలు కలిగించే భావోద్వేగాలను పెంపొందించుకునే అలవాటు చేసుకోవచ్చు. మనలో చెలరేగే ఆలోచనలను గురించి ఆలోచించ డాన్ని ఇంగ్లీష్ లో  "మెటాకాగ్నిషన్" అంటారు. ఈ పదానికి సరి ఐన తెలుగు అర్థం నాకు స్ఫురించ లేదు.అంతర్జాలం లో వెతికినా దొరకలేదు. అందుకునే అసలైన ఆంగ్ల పదాన్ని ఇక్కడ వాడుతున్నాను.
    మెటా కాగ్నిటివ్ ఆలోచనా విధానాన్ని అవలంబించడం ద్వారా మన కోప తాపాలను, ఇతర హానికారక భావోగ్వేదాలను మనం అదుపులో పెట్టుకోవచ్చు.విన్స్ పంజానో అనే ఆత్సాహికుడు నిర్వహిస్తున్న "ది హ్యాపీ హోమన్ క్యు లస్" అనే బ్లాగు లో ఈ మెటాకాగ్నిషన్ గురించిన విస్తృత సమాచారం లభిస్తోంది. నిత్య జీవితం లో ఉపయోగపడే సమాచారం గల కొన్ని మంచి పుస్తకాల గురించి కూడా ఈ బ్లాగ్ లో మనం తెలుసుకోవచ్చు.
ఆసక్తిగల వారు ఈ బ్లాగ్ అడ్రస్ ని అనుసరించగలరు.
http://www.happyhomunculus.com/

9, జనవరి 2012, సోమవారం

పోస్ట్ సీక్రెట్

గత సంవత్సరం లో టైం మాగజీన్ ప్రచురించిన అత్యుత్తమ బ్లాగ్ ల జాబితా లో చోటుచేసుకున్న పోస్ట్ సీక్రెట్ అనే బ్లాగ్ నన్ను చాలా ఆకట్టుకొంది. ఆధునిక జీవితం లో సాధారణం గా తారస పడే వ్యక్తుల జీవితాల్లో కొన్ని రహస్యాలను ఇక్కడ చూడవచ్చు.
  ప్రపంచం లో ఎవరైనా తమ జీవితంలో ని రహస్యాలను అతి గోప్యంగా అంతర్జాలంలో పంచుకోవాలనుకున్నపుడు పోస్ట్ సీక్రెట్ కి పంపించొచ్చు.ప్రతి వారాంతం లో కొన్ని ప్రచురించ దగిన పోస్ట్ కార్డు రహస్యాలను పోస్ట్ సీక్రెట్.కాం లో ప్రచురిస్తారు.
  పోస్ట్ సీక్రెట్  ని ప్రపంచంలో నే అతిపెద్ద ప్రకటనలు లేని బ్లాగు గా నిర్వాహకులు పేర్కొంటున్నారు.ఈ బ్లాగు గురించి మరిన్ని వివరాలు తెలుసుకోగోరే వారు "పో సీక్రెట్ కమ్యూనిటీ .కాం" ని సందర్శించగలరు.
http://postsecretcommunity.com/